రీఎంట్రీ పై రేణు దేశాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 May 2020 11:54 AM GMT
రీఎంట్రీ పై రేణు దేశాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

టాలీవుడ్‌లో 'బ‌ద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పెళ్లి త‌రువాత సినిమాల‌కు దూరంగా ఉంది. విడాకుల అనంత‌రం ప్ర‌స్తుతం చెన్నైలో నివ‌సిస్తోంది రేణు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ట‌. రైతుల‌పై త్వ‌రలోనే ఓ చిత్రాన్ని తీయ‌నుట్లు ప్ర‌క‌టించింది. ఆమె ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా కొర‌కు ఇటీవ‌ల ఓ గ్రామానికి వెళ్లి ఆమె.. అక్క‌డి ప్ర‌జ‌ల‌తో కొంత స‌మ‌యం గ‌డిపాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఫ్రీ ప్రోడ‌క్ష‌న్ పుటేజీ.. మ‌న రైతుల క‌థ‌ల‌ను మీ ముందుకు తీసుకురావాల‌ని ఆతృత‌గా ఉన్నాన‌ని ఆ వీడియో కింద రాసుకొచ్చింది.

సినిమాల్లో రీఎంట్రీ పై తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో స్పందించింది. సినిమాల్లో మ‌ళ్లీ న‌టించ‌డానికి తాను కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని తెలిపారు. త‌ల్లి పాత్ర‌లు పోషించ‌డానికి సిద్ద‌మేనా అని అడ‌గ‌గా..? మంచి పాత్ర అయితే.. మ‌హేష్ బాబుకు, ప్రభాస్ కు త‌ల్లి పాత్ర‌లు పోషించ‌డానికైనా సిద్దమేన‌ని చెప్పింది. మంచి అవ‌కాశం వ‌స్తే.. హీరో చిన్న‌త‌నం, ప్లాష్ బ్యాక్ స‌న్నివేశాల్లో త‌ల్లిగా చేస్తాన‌ని అన్నారు. వృద్దురాలి పాత్ర‌ను పోషించేందుకు వెనుకాడ‌న‌ని అన్నారు. మేమంతా న‌టీనటులం.. ఏ పాత్ర పోషించ‌డానికైనా సిద్దమ‌ని చెప్పారు. ఇక రేణు ఎప్పుడెప్పుడూ రీ ఎంట్రీ ఇస్తుందా అని ఆమె అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story