'రంగమార్తాండ'లో రంగమ్మత్త.. 'స్పైసీ రోల్' అంట మరి..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Dec 2019 3:42 PM IST
జబర్దస్త్ షో యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ తెలుగు వారికి సుపరిచితురాలే. అప్పుడప్పుడు ఐటం సాంగ్స్‌లో నర్తించి.. హాట్ గర్ల్ ఇమేజ్‌ను తెచ్చుకున్న అనసూయ.. క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ రూపొందించిన రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి అందరి ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. రంగమ్మత్తతో అనసూయకు మాంచి ఇమేజ్ వచ్చినా తను మాత్రం పాత్రల ఎంపికలో అచితూచి అడుగులు వేస్తుంది. తాజాగా మరో క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించనున్న 'రంగమార్తాండ'లో నటించేందుకు లనసూయ ఒప్పుకుందట.
ఈ మేరకు కృష్ణవంశీ.. ట్వీట్ చేశాడు. అనసూయతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. ఎప్పుడూ నవ్వుతూ, ఉత్సాహంగా ఉండే అనసూయ 'రంగమార్తండ'లో ఓ స్పైసీ రోల్‌లో కనిపించనుందని.. ట్వీట్‌కు అనసూయ ఫోటోను జత చేస్తూ కృష్ణవంశీ ట్వీటర్ ద్వారా షేర్ చేశాడు.
Next Story