క‌రోనాను జ‌యించిన బిగ్‌బీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Aug 2020 12:03 PM GMT
క‌రోనాను జ‌యించిన బిగ్‌బీ

బాలీవుడ్ బాద్‌షా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ క‌రోనా నుండి కోలుకున్నాడు. గత మూడు వారాలుగా ముంబై నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అమితాబ్‌కు తాజాగా చేసిన టెస్టులో కోవిడ్ నెగిటివ్ వచ్చిందని ఆయ‌న త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ తెలిపాడు. అమితాబ్‌ను ఆస్ప‌త్రి నుండి డిశ్చార్జ్ చేసారని చెప్పాడు.ఇకపై అమితాబ్‌ ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటార‌ని అభిషేక్ ట్వీట్ చేసాడు. ఇప్పటి వరకు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వాళ్లకు అభిషేక్ బచ్చన్ ధ‌న్య‌వాదాలు తెలిపాడు. అమితాబ్ ఇంటికి చేరుకోవడంతో ఆయ‌న అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.

ఇదిలావుంటే.. అమితాబ్‌తో పాటు కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా వచ్చింది. అయితే ఇప్పటికే పాప, ఐశ్వర్య క‌రోనానుండి కోలుకున్నారు. వారికంటే ముందే పాజిటివ్ వ‌చ్చిన‌ సీనియర్, జూనియర్ బచ్చన్ మాత్రం హాస్పిటల్‌లోనే ఉన్నారు. దాంతో అభిమానులు టెన్షన్ పడుతున్న‌ సమయంలో అమితాబ్ కోలుకున్నార‌నే వార్త వెలువ‌డింది.

Next Story
Share it