బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యలకు కరోనా పాజిటివ్ వచ్చింది. అమితాబ్ కోలుకోవాలంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఆయన నానావతి ఆసుపత్రి లోని వైద్య సిబ్బందిని, ముఖ్యంగా కోవిద్ వారియర్స్ ను పొగుడుతూ మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది ఈ మధ్యనే చోటుచేసుకున్న ఘటన అంటూ షేర్ చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన అనంతరం ఆయన ఆసుపత్రిలో చేరారని.. అక్కడి సిబ్బందిని అభినందిస్తూ వీడియో పోస్ట్ చేశారని పలువురు వీడియోను షేర్ చేస్తున్నారు.

“Amit Ji’s video in which he thanked Nanavati Hospital staff some time back! A friend sent just now! Everyone it seems is up in Mumbai and wishing Bachchan Sir a speedy recovery! (sic),” అంటూ ట్విట్టర్ యూజర్ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో ఇప్పటిది కాదని అందులో చెప్పుకుంటూ వచ్చారు.

Aaj Tak న్యూస్ ఛానల్ ఆ వీడియోను ఇప్పటిది అని భావించి ట్విట్టర్ లో పోస్టు చేసింది. “Amitabh Bachchan releases video from Nanavati Hospital, Thanked all the doctors and staff,” అంటూ వీడియోను పోస్ట్ చేశారు. అమితాబ్ బచ్చన్ వీడియోను నానావతి ఆసుపత్రిలో నుండి రికార్డు చేసి అప్లోడ్ చేశారని ఆ వీడియోలో తెలిపారు.

Aaj Tak వార్తా సంస్థ మాత్రమే కాకుండా ఇతర మీడియా సంస్థలు కూడా ఆ వీడియోను తమ తమ యుట్యూబ్ ఛానల్స్ లో పోస్టు చేశారు. ఫేస్ బుక్ లో కూడా వీడియోను వైరల్ చేశారు.

Ab1

నిజ నిర్ధారణ:

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియో ఇప్పటిది కాదని స్పష్టమవుతోంది. ఈ వీడియోను Bombay Talkies TV యూట్యూబ్ ఛానల్ లో ఏప్రిల్ 23న అప్లోడ్ చేశారు. “Watch Bombay Talkies TV. Amitabh Bachchan salutes doctors. Megastar Aazaad | Nanavati Hospital,” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.

నానావతి ఆసుపత్రి స్టేట్మెంట్ ప్రకారం ఈ వీడియోను ఏప్రిల్, 2020న రికార్డు చేశారు. ఆయన ఆసుపత్రి వైద్య సిబ్బందిని ప్రశంసించారు. అమితాబ్ బచ్చన్ ఆసుపత్రి సిబ్బందికి పిపిఈ కిట్స్ ను అందించడమే కాకుండా.. నానావతి ఆసుపత్రి సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపడానికి వీడియోను కూడా అప్లోడ్ చేశారు.

ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.. కానీ ఈ మధ్య తీసిన వీడియో కాదు. ఈ వీడియోను కోవిద్ వారియర్స్ ను ఎంకరేజ్ చేస్తూ ఏప్రిల్ నెలలో అమితాబ్ పోస్ట్ చేసిన వీడియో.

అమితాబ్ బచ్చన్ కుటుంబం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బచ్చన్ ఇంటిలో మున్సిపాలిటీ అధికారులు నేడు క్రిమిసంహారకాలు జల్లారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.