కరోనాతో మా దేశంలో 2 లక్షల మంది చనిపోయే ప్రమాదం: అమెరికా వైద్య నిపుణుడు

By సుభాష్  Published on  30 March 2020 5:05 AM GMT
కరోనాతో మా దేశంలో 2 లక్షల మంది చనిపోయే ప్రమాదం: అమెరికా వైద్య నిపుణుడు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. లక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, వేలాల్లో మృత్యువాత పడుతున్నారు. ఇక ఇతర దేశాలకంటే అగ్రరాజ్యం అమెరికా కరోనాతో వణికిపోతోంది. అమెరికాను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కరోనా కారణంతో అధ్యక్షుడు ట్రంప్‌ నెల రోజుల పాటు మరిన్ని ఆంక్షలు విధించారు. ఇప్పటికే లక్షా 40వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2500 వరకు మరణాలు సంభవించాయి. దీంతో అగ్రరాజ్యం మరింత ఆందోళన చెందుతోంది. రోజురోజుకు కేసులు అధికం కావడంతో ట్రంప్‌కు కలవరపాటుకు గురి చేస్తోంది.

అయితే ఈ మహమ్మారి బారిన మా దేశంలో లక్ష నుంచి రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని అమెరికా వైద్య నిపుణుడు ఆంథోనీ ఫాసి హెచ్చరించడం ఇప్పుడు మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ముందునుంచే నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తం అయితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైరస్‌ రోజురోజుకు ఎక్కువగా వ్యాపిస్తుండటంతో మరో 30 రోజుల పాటు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాల్సిందేనంటూ పేర్కొన్నారు.

అమెరికాలో కొన్ని మిలియన్ల ప్రజలకు ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో మా దేశం పురోగతి సాధిస్తోందని చెప్పడం తొందరపాటే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం రాత్రి వరకు అమెరికాలో లక్షా 40వేల మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏది ఏమైనా అమెరికాకు రాబోయే రోజుల్లో గడ్డకాలంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story