అమెరికా: 2 ట్రిలియ‌న్ల డాల‌ర్ల ప్యాకేజీ

By అంజి  Published on  25 March 2020 4:31 PM IST
అమెరికా: 2 ట్రిలియ‌న్ల డాల‌ర్ల ప్యాకేజీ

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ అన్ని దేశాలతో పాటు అగ్ర దేశం అమెరికాను కూడా కాకవికలం చేస్తోంది. అమెరికాలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండడం.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ కేసులు అమెరికాలో క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో 55 వేల మంది కరోనా బారిన పడ్డారు. 784 మంది కరోనా సోకి మృతి చెందారు. కరోనా వైరస్‌ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ప్రభుత్వం.. సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న ఆర్థిక వ్యవస్థను.. గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే రెండు ట్రిలియన్‌ డాలర్ల ప్యాకెజీని ప్రకటించింది. వైట్‌హౌస్‌తో పాటు ప్రతినిధుల బృందం కూడా పరిస్థితులను అర్థం చేసుకొని ఈ ప్యాకేజీ ప్రకటనకు మద్దతు తెలిపింది. ఈ ప్యాకేజీ వల్ల ఆ దేశంలోని వ్యాపారవేత్తలు, కార్మికులు, వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ లబ్ది పొందనున్నారు.

Also Read: పోలీస్‌ స్టేషన్లకు యువత పరుగు!

ఈ రెండు ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీలో 500 బిలియన్‌ డాలర్లను పరిశ్రమల కోసం కేటాయించనుంది. అమెరికాలోని ప్రతి ఒక్కరి ఖాతాలో 1200 డాలర్లు జమకానున్నాయి. చిన్న పిల్లలకు కూడా 500 డాలర్లు ఇచ్చేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ఒకే చెప్పిందని తెలిసింది. ఆధునిక అమెరికా చరిత్రలో ఇదే అతి పెద్ద ఉద్దీపన ప్యాకేజీ అని నిపుణులు అంటున్నారు.

Also Read: ఇంటి అద్దె అడగొద్దు.. సీఎం విజ్ఞప్తి

Next Story