ఏపీ: అంబులెన్స్‌ల ప్రారంభోత్సవం రోజే అపశృతి.. మూడు అంబులెన్స్ లు ఢీకొని..
By సుభాష్Published on : 1 July 2020 2:18 PM IST

ఏపీలో బుధవారం ముఖ్యమంత్రి జగన్ 108, 104 అంబులెన్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం 1088 అంబులెన్సు లను విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవం రోజే అపశృతి చోటు చేసుకుంది. బందర్ రోడ్డులో మూడు 108 అంబులెన్స్ లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. వాహనాలు విజయవాడలోని బందర్ రోడ్ బెంజ్ సర్కిల్ నుంచి కంట్రోల్ రూమ్ వరకు వరుసగా ఉండగా, ముఖ్యమంత్రి జగన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
దీంతో వాహనాలన్ని ఒక్కసారిగా ముందుకు కదిలాయి. బందర్ రోడ్డు వద్ద మూడు 108 అంబులెన్స్ లు ఢీకొన్నాయి. వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయినప్పటికీ, ప్రారంభోత్సవం రోజు ఇలా జరగడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Next Story