ఏపీలో 108, 104 అంబులెన్స్‌ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

By సుభాష్  Published on  1 July 2020 3:56 AM GMT
ఏపీలో 108, 104 అంబులెన్స్‌ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనపగ్గాలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. పాలన పరంగా దూసుకువెళ్తున్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు కదులుతూ ప్రజల కోసం ఎన్నో కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇక తాజాగా 108, 104 అంబులెన్స్‌ లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలపైగా ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో సేవలందించిన సీఎం జగన్.. ఇప్పుడు అత్యంత వైద్య సేవలందించే 108, 104 సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒకే సారి 1088 వాహనాలు బుధవారం 935 గంటలకు విజయవాడలో జగన్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లపోయాయి. ఈ వాహనాల్లో అత్యాధునిక వైద్య సేవలను జోడించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

108 వాహనాల్లో మార్పులు

కాగా, ప్రమాదానికి, అనారోగ్యానికి గురైన వెంటనే వచ్చే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలు ఏర్పాటు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్‌ లో కొనుగోలు చేశారు. ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌ లను వినియోగించన్నారు. ఇక కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌ లో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టుకుసంబంధించినవి కాగా, 104 సర్వీసులు అడ్వాన్స్‌ డ్‌ లైఫ్‌ సపోర్టు గా తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్స్‌ లను చిన్నారులకు వైద్య సేవలందించేలా తయారు చేశారు

సదుపాయాలు

బీఎల్‌ఎస్‌ అంబులెన్స్‌లో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్‌, వీల్‌ చైర్‌, బ్యాగ్‌ మస్క్‌, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏఎల్‌ఎస్‌ అంబులెన్స్‌ లో క్రిటికల్‌ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లను సైతం అమర్చారు. నియో నేటల్‌ అంబులెన్స్‌ లో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను అమర్చారు.

104 సర్వీసుల్లో సదుపాయాలు

ప్రతి మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌లో ఒక వైద్యాధికారి, డేటా ఎ ట్రీ ఆపరేటర్‌, డ్రైవర్‌, ఏఎన్‌ఎం, ఆశావర్క్‌ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇకనుంచి గ్రామాలలో సైతం వేగవంతంగా వైద్య సేవలు అందించనున్నారు. అంతేకాదు రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. అలాగే రోగులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా అందించనున్నారు.

ప్రతి ఎంఎంయూలో ఆటోమెటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ తోపాటు గ్లోబల్‌ పోజిషనింగ్‌ విధానం కూడా ఉంటుంది. రోగుల డేటాను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయడం కోసం ట్యాబ్‌, పర్సనల్‌ కంప్యూ కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు.

వేగవంతంగా సేవలు

పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో,గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజన్సీ ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌ లు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

Next Story
Share it