గుంటూరు: రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతులు, మహిళలు, విద్యార్థులు రోడ్కెక్కారు. మహాధర్నాలు 18వ రోజుకు చేరుకున్నాయి. రైతుల జేఏసీ శుక్రవారం సకలజనుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అమరావతిలో పూర్తిగా బంద్‌ వాతావరణం నెలకొంది. మందడంలో మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా రైతులు ధర్నా చేపట్టారు.

పోలీసులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించవద్దని, చివకు మంచి నీళ్లు కూడా ఇవ్వద్దొని నిర్ణయించుకున్నారు. తమ షాపుల ముందు కూర్చోవద్దంటూ వ్యాపారులు సృష్టం చేశారు. తమ గ్రామంలోకి పోలీసులు రావద్దొంటూ పోలీసుల వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రోడ్లపైకి రైతులు భారీగా చేరుకోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మాకు సహకరించాలంటే.. మాకు సహకరించాలంటూ పోలీసులు, రైతులు పరస్పరం కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడుకున్నారు. దొండపాడులో రైతు మల్లికార్జున రావు గుండెపోటుతో మృతి చెందారు. గత 17 రోజులుగా మల్లికార్జున రావు అమరావతి ఆందోళనలో పాల్గొన్నారు. తుళ్లూరులో పోలీసుల వైఖరికి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. మల్లికార్జునరావుకు రైతులు నివాళులర్పించాఆరు. బ్యాంకులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయూలు మూతపడ్డాయి.

బోస్టన్‌ కమిటీ నివేదిక.. బోగస్‌ నివేదిక అంటూ రైతులు విమర్శలు చేస్తున్నారు. అమరావతిలో బంద్‌ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఉండవల్లిలో రైతులు మానవహార నిర్వహించారు. సచివాలయం, హైకోర్టుకు వెళ్లే రహదారిపై రైతులు నిరసనకు దిగారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరచకాలు సృష్టిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోరాష్ట్రపతి పాలన విధించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. మల్కాపురం జంక్షన్‌తో రైతులు పోలీసుల బూట్లు తుడిచి నిరసన వ్యక్తం చేశారు.

అర్థరాత్రి తమ గ్రామంలో పోలీసులు హల్‌చేశారని వెలగపూడి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంటి తలుపులను కొట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. తమ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అర్థరాత్రి ఎక్కడికో తీసుకెళ్లారని, అతని ఆచూకీ ఇంతవరకు లభించలేదని ఆందోళనలు చేస్తున్నారు. నీరుకొండలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాజధాని రైతులకు ధర్నాకు కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి సంఘీభావం ప్రకటించారు. గ్రామస్తులు రోడ్లపై బైఠాయించిన నిరసన తెలియజేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.