పేకాట స్థావ‌రాల‌పై పోలీసులు దాడి.. ప‌ట్టుబ‌డింది మాత్రం మ‌గ‌వాళ్లు కాదు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Nov 2019 7:35 PM IST
పేకాట స్థావ‌రాల‌పై పోలీసులు దాడి.. ప‌ట్టుబ‌డింది మాత్రం మ‌గ‌వాళ్లు కాదు.!

అమరావతి : ఒక‌ప్పుడు మ‌గ‌వాళ్లు పేకాట ఆడేవారు. కానీ ఇప్పుడు మ‌హిళ‌లు కూడా ఆ మ‌హ‌త్ కార్యానికి పూనుకుంటున్నారు. అన్ని రంగాల్లో స్త్రీలు వృద్ధిలోకి వ‌చ్చిన‌ట్లుగానే.. ఇలాంటి చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల్లోనూ రాణిస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. వివ‌రాళ్లోకెళితే.. తాడేపల్లి పట్టణం సీతనగరం సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల‌లో పోలీసులే షాక‌య్యేలా.. ఒక నివాసంలో గుట్టుచప్పుడు కాకుండా 8 మంది మహిళలు పేకాట ఆడుతూ ద‌ర్శ‌న‌మిచ్చారు. అవాక్క‌యిన పోలీసులు మ‌హిళ‌లంద‌రిని అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుండి లక్షా 36 వేల నగదును... 8 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల‌లో పట్టుపడ్డ వారందరు మహిళలు కావటంతో చర్చ‌నీయాంశంగా మారింది.

Next Story