అల్లు అర్జున్ 'పుష్ప' ఫస్ట్ లుక్ రిలీజ్
By Newsmeter.Network Published on 8 April 2020 10:45 AM ISTఎప్పుడూ కొత్తకొత్త పాత్రలతో.. వినూత్నమైన కథనాలతో అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు. ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అభిమానుల్లో జోష్ నింపిన ఈ స్లైలీష్ స్టార్.. కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తన 20వ చిత్రం ఫస్ట్ లుక్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. భారీగా పెరిగిన జుట్టు, గడ్డంతో కోపంగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటో బన్నీ అభిమానులకు కొత్త జోష్‌ను నింపుతోంది. మైత్రీ మూమీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ఈ సినిమాలో నటిస్తున్నారు.
Also Read :డబ్ల్యూహెచ్‌వో మమ్మల్ని మోసంచేసింది.. నిధులు నిలిపివేస్తాం – ట్రంప్
ఈ సినిమాకు 'పుష్ప' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను 'పుష్ప'రాజ్‌గా ఐదు భాషల్లో నిర్మించబోతున్నట్లు మైత్రీ మువీ మేకర్స్ ప్రకటించింది. ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్న సంస్థ.. సోషల్ మీడియాలో ఈ లుక్‌ను షేర్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. దీనికితోడు ఆయా భాషల్లో సంబంధించిన పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ పనిచేయనున్నారు. బన్నీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో తొలి పోస్టర్‌ను రిలీచేసిన వెంటనే అభిమానులు రీ ట్వీట్లు చేస్తున్నారు. సూపర్ లుక్ అంటూ.. బన్నీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
�
�