అరె.. 'బన్నీ' లారీ డ్రైవర్‌ అయిపోతున్నాడు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jan 2020 5:00 PM GMT
అరె.. బన్నీ లారీ డ్రైవర్‌ అయిపోతున్నాడు.!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ తో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఐతే తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ రోల్ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో బన్నీ రఫ్ లుక్ లో ఒక లారీ డ్రైవర్‌ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. నెగిటివ్ రోల్ నుండి పాజిటివ్ రోల్ గా మారడమే ఈ సినిమా మెయిన్ పాయింట్ అట.

అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కూడా చాల కీలకంగా ఉండబోతుందట. స్వతహాగా సుకుమార్ తన ప్రతి చిత్రంలోనూ కథానాయికలకు మంచి ప్రాథాన్యం ఇస్తూ.. వారి కోసం మంచి పాత్రలను డిజైన్ చేస్తుంటాడు. మెయిన్ గా అన్ని విధాలుగా వారి పాత్రలను కథలో ఇన్వాల్వ్ చేస్తుంటాడు. అదేవిధంగా అల్లు అర్జున్ తో చేస్తోన్న సినిమాలో కూడా హీరోయిన్ పాత్రను ఓ పల్లెటూరి యువతిగా చాల బలంగా రాసుకున్నారట. ఇక ఈ పాత్రలో రష్మిక మండన్నా నటించనుంది.

ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ తో చేస్తోన్న 'అల వైకుంఠపురములో' సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమా రిలీజ్ అయిన వారం తరువాత నుండే బన్నీ సుకుమార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. నిజానికి సుకుమార్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళటానికీ చాలా కాలం ఎదురుచూసిన బన్నీ.. సుకుమార్ కోసం ఏకంగా బల్క్ డేట్లు ఇచ్చాడు.

పైగా ఈ సంవత్సరం మొత్తం మూడు సినిమాలతో బిజీ బిజీగా గడపబోతున్నాడు. మరి సుకుమార్ బన్నీకి సాలిడ్ హిట్ ఇస్తాడా... 'రంగస్థలం' సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుక్కు, రంగస్థలం లాగే ఈ సినిమాతోనూ మరో సూపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Next Story