అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు పండగే.. కొరటాల దర్శకత్వంలో బన్ని 21వ మూవీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 July 2020 1:36 PM IST
అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు పండగే.. కొరటాల దర్శకత్వంలో బన్ని 21వ మూవీ

ఈ ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఈ రోజు బన్ని అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఉంటుందని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఆ సర్‌ప్రైజ్‌ ఏంటా అని బన్ని అభిమానులు తెగ ఎదురు చూశారు.

చెప్పినట్లుగా గీతా ఆర్ట్స్‌ బన్ని అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అర్జున్‌ 21వ చిత్రం తెరకెక్కనుంది. కాగా.. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. పాన్‌ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ సుధ ఆర్ట్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. శాండీ, స్వాతి, న‌ట్టి స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తున్న బన్నీ.. దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ అనే మూవీ కూడా చేయ‌నున్నాడు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్న ఈ మూవీ పోస్టర్ బన్నీ పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. కొరటాల‌తో సినిమా పూర్త‌య్యాక ఐకాన్ మూవీ మొద‌లు పెడ‌తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా.. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.



Next Story