మంత్రి ఈటల గారు కాపాడండి.. ఇండియాలో ఇంత ఫ్రాడా..?
By తోట వంశీ కుమార్ Published on 8 July 2020 5:26 PM ISTకరోనా పేరు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నాయి ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు. తాజాగా హైదరాబాద్‌లో మరో ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) హాస్పిటల్ యాజమాన్యం కరోనా పేరు చెప్పి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని విజయ కేసరి అనే డాక్టర్ సెల్పీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
నా తండ్రికి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరాం. ఆతరువాత నాకు, మానాన్నకు కరోనా పాజిటివ్ అని చెప్పి ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. అయితే.. నాకు ఎలాంటి సింటమ్స్ లేవని అయినా గత పదిరోజులుగా ఆస్పత్రిలో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు తమకు ఆక్సిజన్ గాని వెంటిలేటర్ గాని పెట్టలేదని అయినప్పటికీ వాటికీ బిల్లు వేశారని తెలిపింది. అధిక బిల్లులు వసులు చేయటం ఏంటని ప్రశ్నించినందుకు తనను డిశ్చార్జ్ చేయాలని చూస్తున్నారని తెలిపింది. ఇండియాలో ఇంత ఫ్రాడ్ చేస్తారా ? అంటూ ప్రశ్నించింది. ఇప్పటికే ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ గారికి ఫోన్ చేసానని,తమను ఎవరైనా రక్షించాలని వేడుకుంది.