సినీతారలను ఇంప్రెస్‌ చేయడానికి అభిమానులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. వారు పెట్టే ప్రతి పోస్టుకు లైకులు, కామెంట్లు చేస్తూ కొందరు ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తుండగా.. మరికొందరు తమ స్కిల్స్‌ని ఉపయోగించి ప్రయత్నం చేస్తారు. సమ్మోహనం, అంతరిక్షం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అదితి రావు. తాజాగా ఆమె అభిమాని గుహన్‌ విభిన్నంగా పోటో ఎడిట్‌ చేసి ట్వీట్ చేశాడు.

ఒక బిర్యానీలో అదితి హెడ్ వరకు ఎడిట్ చేసి ట్రాన్స్ఫరెంట్ గా పేస్ట్ చేశాడు. బిర్యానీ మరియు అదితి కలిసి కనిపిస్తున్న ఆ ఫొటోను ట్వీట్ చేయడంతో పాటు దానికి ‘అదితి పలావ్’ అంటూ పేరు పెట్టాడు. దాన్ని చూసిన అదితి ‘బాబోయ్ చంపేశారు’ అంటూ చాలా స్మైలింగ్ ఎమోజీలను పోస్ట్ చేసింది. తన ఫొటోకు అదితి స్పందించడం పట్ల ఆ అభిమాని తెగ ఆనందపడిపోతున్నాడు. ఓ మైగాడ్ నన్ను ఆమె గుర్తించారంటూ నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్‌గా మారింది. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది అదితిరావు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort