'అదితి పలావ్.. బాబోయ్ చంపేశారు'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2020 7:38 AM GMT
అదితి పలావ్.. బాబోయ్ చంపేశారు

సినీతారలను ఇంప్రెస్‌ చేయడానికి అభిమానులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. వారు పెట్టే ప్రతి పోస్టుకు లైకులు, కామెంట్లు చేస్తూ కొందరు ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తుండగా.. మరికొందరు తమ స్కిల్స్‌ని ఉపయోగించి ప్రయత్నం చేస్తారు. సమ్మోహనం, అంతరిక్షం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అదితి రావు. తాజాగా ఆమె అభిమాని గుహన్‌ విభిన్నంగా పోటో ఎడిట్‌ చేసి ట్వీట్ చేశాడు.

ఒక బిర్యానీలో అదితి హెడ్ వరకు ఎడిట్ చేసి ట్రాన్స్ఫరెంట్ గా పేస్ట్ చేశాడు. బిర్యానీ మరియు అదితి కలిసి కనిపిస్తున్న ఆ ఫొటోను ట్వీట్ చేయడంతో పాటు దానికి 'అదితి పలావ్' అంటూ పేరు పెట్టాడు. దాన్ని చూసిన అదితి 'బాబోయ్ చంపేశారు' అంటూ చాలా స్మైలింగ్ ఎమోజీలను పోస్ట్ చేసింది. తన ఫొటోకు అదితి స్పందించడం పట్ల ఆ అభిమాని తెగ ఆనందపడిపోతున్నాడు. ఓ మైగాడ్ నన్ను ఆమె గుర్తించారంటూ నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్‌గా మారింది. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది అదితిరావు.



Next Story