రెండు కార్లను అమ్మేసిన రేణుదేశాయ్‌.. ఎందుకంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2020 9:20 PM IST
రెండు కార్లను అమ్మేసిన రేణుదేశాయ్‌.. ఎందుకంటే..?

ఒకప్పటి టాలీవుడ్‌ హీరోయిన్‌ రేణు దేశాయ్‌ ఓ బాధ్యత గల తల్లిగా తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సినిమాల్లో నటించకపోయినా, బుల్లి తెరమీద కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆమె తన రెండు కార్లను అమ్మేశారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

ఆమెకేవైనా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అందుకే కార్లు అమ్మేశారా? అనుకునేరు.. అలాంటిదేమీ లేదు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన ఫాలోవర్స్‌కు ఒక రిక్వెస్ట్‌ చేశారు. మాములుగా పెట్రోల్‌ మరియు డిజిల్‌తో నడిచే కార్ల కంటే కూడా విద్యుత్‌తో నడిచే కార్లను వినియోగించమని చెబుతున్నారు. అందరి చెప్పే ముందే తానే ఆచరించి చూపించింది. ఇప్పటి వరకు తన దగ్గరున్న ఆడి ఏ6, పోర్ష్ బాక్ట్సెర్ కార్లను అమ్మేసి పర్యావరణానికి ఇబ్బంది కలిగించని ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. దీనికి అంతటికి ప్రధాన కారణం తన వంతుగా తాను పర్యావరణంలో కార్బన్ ను తగ్గించడం కోసమే అని ఆమె తెలిపారు. తాను చదివిన ఓ కథనం ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. కాగా రేణు దేశాయ్ విజ్ఞ‌ప్తి మేర‌కు చాలా మంది నెటిజ‌న్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు

Next Story