కాంగ్రెస్ పార్టీకి కుష్బూ రాజీనామా

By సుభాష్  Published on  12 Oct 2020 5:38 AM GMT
కాంగ్రెస్ పార్టీకి కుష్బూ రాజీనామా

తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు కుష్బూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆమె జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కుష్బూ ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో సోమవారం మధ్యాహ్నం బీజేపీలో చేరనున్నారు. ఇందు కోసం ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకుని బీజేపీ పెద్దలతో మంతనాలు సైతం కొనసాగించారు. వారి ఆహ్వానం మేరకే బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.

కుష్బూ 2014 నుంచి ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. నిన్నటి వరకు ఆమె కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగారు. అయితే 2014 నుంచి కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోవడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Next Story
Share it