బ్రేకింగ్: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత గెలుపు

By సుభాష్  Published on  12 Oct 2020 4:19 AM GMT
బ్రేకింగ్: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత గెలుపు

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత గెలుపొందారు. ఈ గెలుపుతో కాంగ్రెస్‌, బీజేపీలు డిపాజిట్లు కోల్పోయాయి. కాసేపట్లో కవిత గెలుపొందినట్లుగా అధికారులు ధృవీకరణ అందజేయనున్నారు.

కాగా, ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రారంభమైంది. ఈ లెక్కింపులో మొత్తం ఆరు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ స్థానానికి అక్టోబర్‌ 9న పోలింగ్ జరిగింది. మొత్తం 824 ఓటర్లు ఉండగా, 823 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీలో టీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్‌ నుంచి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ పోటీ చేశారు.

Next Story