బంగారు నాణేలు పంచిన హీరో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Nov 2020 3:29 PM GMT
బంగారు నాణేలు పంచిన హీరో

కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఎక్కువ‌గా వివాదాల‌తోనే వార్త‌ల్లో నిలుస్తూ ఉంటాడు. అయితే.. ఈ సారి ఓ మంచి ప‌నితో అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు. ప్రస్తుతం శింబు నటిస్తున్న ఈశ్వరన్. సుశీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విలేజ్ నేటివిటీతో తెరకెక్కుతోంది. తాజాగా ఈచిత్ర షూటింగ్ పూరైంది.

చిత్రం పూరైన సందర్భంగా షూటింగ్‌ చివరి రోజున పని చేసిన దాదాపు 400 మందికి వన్‌ గ్రామ్‌ గోల్డ్‌, కొత్త బట్టలను బహుమతిగా ఇచ్చాడు. అంతేగాక దాదాపు 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులకు కూడా పండగ కానుకగా కొత్త బట్టలు పంపిణీ చేశాడు. దీంతో శింబు ఉదారతకు చిత్ర యూనిట్‌ సభ్యలతో పాటు జూనీయర్‌ ఆర్టీస్టులంతా ఆనందం వ్యక్తం చేశారు.

ఇక షూటింగ్ పూరైన సందర్భంగా శింబు ట్వీట్ చేశాడు. ఈ దీపావళికి టీజర్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘ఈశ్వరన్‌ షూటింగ్‌ పూరైంది. ఈ దీపావళికి టీజర్‌ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈశ్వరన్‌ మూవీ టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞ‌త‌లు తెలుపుతున్న’ అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా.. ఈ చిత్రం సంకాంత్రి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు సన్నాహాకాలు చేస్తున్నారు.

Next Story