బిగ్‌బాస్‌లోకి యాంకర్‌ సుమా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ.. ప్రోమో విడుదల

By సుభాష్  Published on  8 Nov 2020 7:09 AM GMT
బిగ్‌బాస్‌లోకి యాంకర్‌ సుమా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ.. ప్రోమో విడుదల

తెలుగులో బిగ్‌బాస్‌ -4 షో రసవత్తరంగా మారనుంది. మొదటి మూడు సీజన్‌లు కూడా ఎంతో సక్సెస్‌తో ముగిసి నాలుగో సీజన్‌ కూడా ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక తాజాగా యాంకర్‌ సుమ కనకాల బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో సైతం విడుదలైంది. కరోనా మహమ్మారి తీసుకొచ్చిందని, అందుకే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లబోతున్నట్లు చెప్పుకొచ్చింది సుమ. ఇక బిగ్‌బాస్‌ స్టేజీపై సుమ, నాగార్జునకు పంచుల మీద పంచులు వేశారు.

అంతేకాకుండా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇప్పుడు అందరి గురించి క్షుణ్ణంగా చదివిన సుమ.. వారి రహస్యాలను సైతం చెప్పేసింది. సుమ వైల్డ్‌ కార్టు ఎంట్రీతో తనకు రానున్న ఐదు వారాలు ఫుల్‌ఫన్‌ ఉంటుందని నాగ్‌ చెప్పుకొచ్చారు. ఇక సుమను వైల్డ్‌కార్డు ద్వారా లోపలికి పంపిస్తున్నట్లు నాగ్‌ చెప్పడం ఈ ప్రోమోలో కనిపిస్తుంది. అంతే ఇంతైనా సమయం లేకుండా ఫుల్‌ బిజీగా ఉండే సుమ.. నిజంగానే వైల్డ్‌ కార్డు ద్వారా హౌస్‌లోకి వెళ్తుందా..? ఇది నిజమేనా..? అని తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Next Story