బాలీవుడ్ నటుడు కన్నుమూత‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2020 7:14 AM GMT
బాలీవుడ్ నటుడు కన్నుమూత‌

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూశారు. గత కొంత‌కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఫరాజ్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అల‌నాటి హీరోయిన్‌ పూజా భట్ ట్విటర్ ద్వారా తెలిపారు.భారమైన హృదయంలో ఈ విషాదాన్ని మీతో పంచుకుంటున్నానని ట్వీట్‌ చేశారు. ఇకపై కూడా అభిమానులు ఫరాజ్‌ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. అలాగే అవసరమైన సమయంలో సాయం అందించిన అందరికీ ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.అక్టోబ‌ర్‌లో ఛాతీ, మెదడు సంబంధింత ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఫరాజ్ ఖాన్ బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. ఆసుప‌త్రి‌ ఖర్చులకు కూడా డబ్బులు లేక‌పోవ‌డంతో అతనికి సాయం చేయాల్సిందిగా పూజా భట్ ట్వీట్ చేశారు. దీంతో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ స్పందించి సాయం అందించారు.

ఇదిలావుంటే.. 1990లో ఫరాజ్ ఖాన్ బాలీవుడ్‌లో నటుడిగా ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫరేబ్, మెహందీ, మైనే ప్యార్ కియా వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. ఫరాజ్ ఖాన్ మృతిప‌ట్ల ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

Next Story