న‌ట ఛ‌త్ర‌ప‌తి ప్ర‌భాస్
మాట‌ల్లో పొద‌ప‌రిత‌నం.. చేత‌ల్లో అప‌ర చాణ‌క్యం..
ఆర‌డుగుల పొడ‌వుకి అంద‌మొక‌టి తోడు.. అద‌నంగా అభిమానుల జోడు..
పెద‌నాన్నఅండ‌తో తెర పైకి… సొంతం ఇమేజ్‌తో చాటుకున్నాడు ఉనికి..
ఆత్మ‌విశ్వాస‌మే అత‌ని ఆయుధం… దానికి ప‌దును పెంచుతోన్న అభిన‌యం..
అమ్మాయిల మ‌న‌సుదోచుకున్న అంద‌గాడు.. డార్లింగ్ అంటూ అంద‌ర్నీ మెప్పిస్తున్న క‌థానాయ‌కుడు..
తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటి చెప్పిన టాలీవుడ్ హీరో… కాదు కాదు.. ఇండియ‌న్ సూప‌ర్ హీరో..
అత‌డే డార్లింగ్ ప్ర‌భాస్.

తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌లు, తండ్రికి త‌గ్గ త‌న‌యులుండ‌టం సాధార‌ణం. కానీ.. పెద‌నాన్న‌కు త‌గ్గ త‌న‌యుడంటే ఠ‌క్కున గుర్తుకువ‌చ్చే పేరు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ప్ర‌ముఖ నిర్మాత సూర్య‌నారాయ‌ణ‌రాజు, సీనియ‌ర్ హీరో కృష్ణంరాజుకు స్వ‌యానా సోద‌రుడు. అత‌ని కొడుకే ఈ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ప్ర‌భాస్ 1979 అక్టోబ‌ర్ 23న జ‌న్మించారు. చిన్న‌ప్ప‌టి నుంచి పెద‌నాన్న వ‌ద్దే పెరిగారు. త‌న న‌ట‌నంటే ప్ర‌భాస్ కు బాగా ఇష్టం కూడా. త‌న తండ్రి, పెద తండ్రులు ఇద్ద‌రూ ద‌గ్గ‌ర పోలిక‌ల‌తో క‌నిపిస్తారు. అందుకేనేమో త‌న‌కీ అవే పొలిక‌లొచ్చాయి. మంచి హైటు, దానికి త‌గ్గ ఈజ్ తో క‌నిపించే ప్ర‌భాస్ మాస్ పాత్ర‌ల‌కు అచ్చు పోసిన‌ట్టుగా క‌నిపించినా క్లాస్ ప్రేక్ష‌కుల‌ను కూడా మెప్పిస్తూ…దూసుకెళుతున్నాడు.

Prabhas First One

 

ప్ర‌భాస్ తొలి చిత్రం ఈశ్వ‌ర్. ప‌క్కా మాస్ క్యారెక్ట‌ర్. త‌న మొద‌టి చిత్రంతోనే ఆక‌ట్టుకుని బెస్ట్ ఇంప్రెష‌న్ సంపాదించుకున్నారు. ఆత‌ర్వాత రాఘ‌వేంద్ర సినిమాతో న‌టుడుగా మంచి మార్కులు సంపాదించినా ఆశించిన స‌క్సెస్ ఇవ్వ‌లేదు. యం.ఎస్.రాజు నిర్మాణ సంస్థలో వ‌ర్షం సినిమా చేసాడు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అంద‌ర్నీ ఆలరించిన సినిమా అది. బాక్సాఫీస్ వ‌ద్ద ల‌క్ష్మీక‌టాక్షమైంది. ఉన్న‌ప‌ళంగా ఒక్క సినిమాతోనే ప్ర‌భాస్ పెద్ద హీరోల స‌ర‌స‌న చేరిపోయాడు.

Eeswar

ఈ సినిమా ప్ర‌భాస్‌లో విజ‌యోత్స‌వాన్ని నింపింది. అదే స్ధాయిలో కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో చ‌క్రం సినిమాలో న‌టించారు. ఈ సినిమా స‌క్సెస్ కాక‌పోయినా… ప్ర‌భాస్‌లో ఓ కొత్త న‌టున్ని చూపించింది. ఇక రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఛ‌త్ర‌ప‌తి సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో అద్భుత విజ‌యం సాధించింది. ఈ సినిమా ప్ర‌భాస్‌కి గ‌ట్టి న‌మ్మ‌కాన్ని ఏర్ప‌రిచింది. అయితే.. ప్ర‌భాస్ విజ‌యానికి పొంగిపోడు.. అప‌జ‌యానికి కృంగిపోడు. పౌర్ణ‌మి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజ‌న్, డార్లింగ్, మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్, రెబ‌ల్, మిర్చి సినిమాలు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ల్లో సుస్ధిర స్ధానం అందించింది.

Billa

 

బాహుబలి ది బిగినింగ్‌, బాహుబలి 2 చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను తన సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇది డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. వ‌చ్చే సంవ‌త్స‌రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌నే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను సైతం మెప్పించిన డార్లింగ్ ప్ర‌భాస్… హ్యాపీ బ‌ర్త్ డే & ఆల్ ది బెస్ట్.

Prabhas 3

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.