బాలల హక్కుల సంఘం అధ్య‌క్షుడుపై కేసు.. ఎందుకంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Dec 2019 8:49 AM GMT
బాలల హక్కుల సంఘం అధ్య‌క్షుడుపై కేసు.. ఎందుకంటే..

బాలల హక్కుల సంఘం అధ్య‌క్షుడు అచ్యుతరావుపై ఎస్సాఆర్ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో కేసు నమోదైంది. మధురానగర్ కాలనీలో ఒక స్థ‌లానికి సంబంధించి అచ్యుతరావు హైకోర్టులో పిటీషన్ ను వేశారు. ఈ పిటీషన్ ను ఉపసంహరించుకోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని అచ్యుతరావు డిమాండ్ చేశారు.

గ‌తంలో తాము కొంత డబ్బు ఇచ్చామ‌ని.. అయినా అచ్యుత‌రావు మ‌మ్మ‌ల్ని డ‌బ్బుల కోసం బెదిరిస్తున్నాడ‌ని మధురానగర్ సొసైటీ కార్యదర్శి సాంబశివరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సాంబశివరావు ఫిర్యాదుపై బాలల హక్కుల సంఘం నేత అచ్యుతరావుపై పోలీసులు 384, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Next Story
Share it