కరీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్‌పై బ‌దిలీవేటు.. ఎంపీతో ఫోన్ సంభాష‌ణే కార‌ణ‌మా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Dec 2019 4:28 PM GMT
కరీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్‌పై బ‌దిలీవేటు.. ఎంపీతో ఫోన్ సంభాష‌ణే కార‌ణ‌మా..?

కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై అనూహ్యంగా బదిలీ వేటు పడింది. ఈ రోజు ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్ఫరాజ్ అహ్మద్‌కు ఎక్సైజ్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. ఇక‌ కరీంనగర్ నూత‌న‌ కలెక్టర్‌గా ప్ర‌భుత్వం శశాంకను నియమించింది. శశాంక ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

అయితే.. సర్ఫరాజ్ అహ్మద్ బదిలీకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో ఆడియో లీక్ వ్యవహారం కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయితో కూడా క‌లెక్ట‌ర్‌కు విభేదాలున్నాయ‌నే టాక్ కూడా బ‌లంగా వినిపిస్తుంది. అయితే.. ఎంపీతో ఫోన్ ఆడియో విషయంపై క‌లెక్ట‌ర్‌ ఇప్పటికే సీఎస్‌కు వివరణ ఇచ్చారు.

ఇదిలావుంటే.. క‌లెక్ట‌ర్ బ‌దిలీపై ప్రభుత్వ వర్గాలు మాత్రం కలెక్టర్ ఆ జిల్లాకు వెళ్లి మూడేళ్లు దాటిపోయిందని.. అందుకే బదిలీ చేశారనే చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో క‌రీంన‌గ‌ర్ జిల్లా కలెక్టర్‌ బదిలీ చర్చనీయాంశంగా మారింది.

Next Story