కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. న‌లుగురి మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Dec 2019 6:39 PM IST
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. న‌లుగురి మృతి

కృష్ణా జిల్లా నందిగామ‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. ఈ ఘటనలో నలుగురు యువ‌కులు మృతిచెందారు. డీసీఎం లారీని వేగంగా వ‌స్తున్న కారు ఢీకొన‌డంతో ఈ ప్రమాదం జ‌రిగింది. వివరాల్లోకెళితే.. నందిగామ నుంచి ఏపీ16డీబీ 5587 నెంబ‌ర్ గ‌ల కారులో న‌లుగురు యువ‌కులు విజయవాడకు బయలుదేరారు.

వారు ప్రయాణిస్తున్న కారు నందిగామ ద‌గ్గ‌ర‌లో అతివేగంగా డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్క‌డిక్క‌డే మృతిచెంద‌గా.. మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. మృతులు నందిగామకు చెందిన దుర్గా, మనోజ్‌, అరవింద్‌, అనిల్‌గా గుర్తించారు. ప్రమాదం జ‌రిగిన‌ప్పుడు కారు 120 కి.మీ వేగంతో వెళ్తుందని స‌మాచారం. సంఘ‌ట‌నా స్థలాన్ని ప‌రిశీలించిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story