అభ‌య భౌతికకాయానికి రీపోస్టుమార్టం..!

By సుభాష్  Published on  13 Dec 2019 10:31 AM GMT
అభ‌య భౌతికకాయానికి రీపోస్టుమార్టం..!

విద్యార్థి అభ‌య భౌతికకాయానికి రీపోర్టుమార్టంన నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట రీపోస్టుమార్టం చేయాలని సీబీఐ అధికారులు భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల రీపోస్టుమార్టంకు ఆటంకం ఎదురైంది. డిసెంబర్ 20లోగా రీపోస్టుమార్టం నిర్వహించాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, 2007 డిసెంబర్ 27న హాస్టల్‌లో అభ‌య హత్యకు గురైంది. విజయవాడలో 12 ఏళ్ల క్రితం అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన అభ‌య హత్యకేసు ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ చివరికి ఈ కేసు సీబీఐకి చేరింది.

తెనాలికి చెందిన అభ‌య ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కళాశాలలో భీఫార్మసీ చదువుతూ, దుర్గా హాస్టల్‌లో ఉండేది. ఆమె చేరిన మొదటి సంవత్సరంలోనే, 2007 డిసెంబర్‌ 27న హాస్టల్‌ గదిలో అత్యాచారం, హత్యకు గురైంది. అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడటం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది.

ఈ దారుణ హత్య వెనుక అప్పటి మంత్రి కోనేరు రంగారావు మనుమడు సతీశ్‌, అతని మిత్రులు ఉన్నారని అభ‌య తల్లి షంషాద్‌ బేగం ఆరోపించారు. పోలీసులు మాత్రం అనాసాగరానికి చెందిన పిడతల సత్యంబాబును అరెస్టు చేశారు. సత్యంబాబును మహిళా న్యాయస్థానం దోషిగా తేల్చి, యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అనంతర కాలంలో హైకోర్టు సత్యంబాబు ను ఈ కేసులో నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది. ఈ కేసును తిరిగి విచారణ చేపట్టాలని సీబీఐకి అప్పగించారు.

Next Story
Share it