హైదరాబాద్ : క‌రుడుగ‌ట్టిన‌ ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా ను సిట్ పోలీసులు హైదరాబాద్ త‌ర‌లించారు. అబ్దుల్ కరీం టుండా ప్ర‌స్తుతం గజియాబాద్ జైల్లో ఉన్నాడు. హైదరాబాదులోని పలు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న టుండా ను ఏడు సంవత్సరాల క్రితం నేపాల్ సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. టుండా ను సిట్ పోలీసులు పిటీ వారంట్ కింద హైదరాబాద్ తీసుకు వచ్చారు. కాగా, అబ్దుల్ కరీం టుండా హైదరాబాద్ లోనే కాక‌.. దేశంలోని పలు ప్రాంతాల‌లో జ‌రిగిన‌ పేలుళ్ల కేసులో ప్ర‌ధాన‌ నిందితుడుగా ఉన్నాడు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.