Fact Check : మక్కా యాత్రకు వెళ్లిన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తీవ్రవాదులను కలిశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Aug 2020 12:36 PM GMT
Fact Check : మక్కా యాత్రకు వెళ్లిన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తీవ్రవాదులను కలిశారా..?

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మక్కా యాత్రకు వెళ్లిన సమయంలో తీవ్రవాదులను కలిశాడంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇద్దరు తీవ్రవాదులను ఆమిర్ ఖాన్ కలిశాడంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టగా.. ఇంకొందరేమో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఆమిర్ ఖాన్ కనీసం ట్విట్టర్ లో పోస్టు చేయలేదని చెబుతున్నారు.

Ak1

Shivam Rajput ట్విట్టర్ లో “Aamir Khan never tweeted on #SushantSinghRajput’s death not even on Independence Day. And here’s a pic of him where he is meeting with Terrorist Tarik Jameel and Junaid Shamshed. SHAME ON YOU AAMIR KHAN (sic).” అంటూ పోస్టు పెట్టాడు. ఆమిర్ ఖాన్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా కనీసం పోస్టు పెట్టలేదు. తీవ్రవాదులైన తారీఖ్ జమీల్, జునైద్ శంషాద్ లను ఆమిర్ ఖాన్ కలిసిన ఫోటో.. నిన్ను చూస్తుంటే సిగ్గు వేస్తోంది.. అని అందులో పోస్టు చేశాడు.

Ak2

మరికొందరు కూడా సోషల్ మీడియాలో ఈ పోస్టును షేర్ చేశారు. దీంతో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

నిజ నిర్ధారణ:

ఆమిర్ ఖాన్ ఇద్దరు తీవ్రవాదులను కలిశాడంటూ పెట్టిన పోస్టు 'పచ్చి అబద్ధం'. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఆమిర్ ఖాన్ ఎటువంటి పోస్టు కూడా పెట్టలేదన్నది నిజం.

ఆమిర్ ఖాన్ ట్విట్టర్ అకౌంట్ ను పరిశీలించగా.. సుశాంత్ గురించి, సుశాంత్ మరణంపై ఆమిర్ ఖాన్ ఎటువంటి ట్వీట్లు చేయలేదు.

ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా The Express Tribune లో డిసెంబర్ 14, 2016న ఆర్టికల్ ను ప్రచురించడం జరిగింది. జునైద్ జంషెడ్ మరణంపై ఆమిర్ ఖాన్ స్పందన గురించి తెలియజేస్తూ కథనాన్ని ప్రచురించారు. ఆ ఆర్టికల్ విషయంలో ఈ ఫోటోను పోస్టు చేశారు. తన తల్లితో కలిసి హజ్ యాత్రకు వెళ్లిన సమయంలో జునైద్ జంషెడ్ ను కలిసినట్లు ఆమిర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. జునైద్ జంషెడ్ చాలా మంచి వ్యక్తి అని తెలిపాడు.

ఫోటోలో ఉన్న వ్యక్తి జునైద్ జంషెడ్. అతడిని తీవ్రవాది అయిన 'జునైద్ శంషాద్' గా భావిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. జునైద్ జంషెడ్ పాకిస్థానీ రికార్డింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. టెలివిజన్ పర్సనాలిటీ కూడా. సింగర్-సాంగ్ రైటర్, నటుడు అయిన జునైద్ జంషెడ్ మతబోధకుడు కూడా..!

ఆ ఫోటోలో ఉన్న మరో వ్యక్తి మౌలానా తారిఖ్ జమీల్.. అతడు కూడా ఇస్లాం మత బోధకుడు, రిలీజియస్ రైటర్, ఓ స్కాలర్ కూడా..! అతడికి తీవ్రవాద సంస్థలకు ఎటువంటి సంబంధం లేదు.

జునైద్ జంషెడ్ మౌలానా తారీఖ్ జమీల్ ను, ఆమిర్ ఖాన్ ను కలిసిన విషయాన్ని యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చాడు. 2012లో హజ్ యాత్రకు వెళ్లిన సమయంలో ఆమిర్ ఖాన్ ను కలిసినట్లు జునైద్ జంషెడ్ తెలిపాడు.

మరో వీడియోలో మౌలానా తారీఖ్ జమీల్ కూడా ఆమిర్ ఖాన్ ను కలిసినట్లు వెల్లడించాడు. ఆమిర్ ఖాన్ ఎంతో ప్రేమతో తనతో మాట్లాడాడని తారీఖ్ జమీల్ చెప్పుకొచ్చాడు.

The News Tribe 27 నవంబర్ 2012న ఆమిర్ ఖాన్ తారీఖ్ జమీల్ ను జునైద్ జంషెడ్ ను కలిసిన ఆర్టికల్ ను పోస్టు చేశారు. హజ్ యాత్రకు ఆమిర్ ఖాన్ వెళ్ళినప్పుడు ఈ ఫోటోను తీసినట్లు తెలిపింది.

జంషెడ్ కూడా 2013లో తన ట్విట్టర్ ఖాతాలో వీడియోను పోస్టు చేశాడు.



మక్కా యాత్రకు వెళ్లిన సమయంలో ఆమిర్ ఖాన్ తీవ్రవాదులను కలిసినట్లు వైరల్ అవుతున్న పోస్టులు 'అబద్ధం'. ఆమిర్ పక్కన ఉన్నది పాకిస్థానీ టెలివిజన్ పర్సనాలిటీ అయిన జునైద్ జంషెడ్.. పాకిస్థాన్ కు చెందిన ఇస్లామిక్ మత బోధకుడు మౌలానా తారిఖ్ జమీల్.

Next Story