నా రూటే సెపరేటు..!

By అంజి  Published on  8 Dec 2019 8:33 AM IST
నా రూటే సెపరేటు..!

నచ్చిన వృత్తి లో ఆనందం చాలామందికి ఉంటుంది. కానీ చూసే వారికి సైతం ఆనందాన్ని పంచే వృత్తులు కొన్ని ఉంటాయి.. అస్సలు అలాంటి లక్షణాలు లేని ఉద్యోగాలు మరికొన్ని ఉంటాయి.అయితే కావాలనుకుంటే ఏ పనినైనా మనసుకు హత్తుకునేలా చేయచ్చు అంటున్నారు ఈ ట్రాఫిక్ పోలీస్. వీరి విధి నిర్వహణ అంటేనే మొదట ఎండ, దుమ్ము, కాలుష్యం ఇవన్నీ గుర్తుకొస్తాయి.

అంత కాలుష్యంలోనూ ట్రాఫిక్‌ను నియంత్రించాలంటే చాలా ఓపిక కావాలి. కానీ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ట్రాఫిక్‌ పోలీసు ఓపికతో పాటు వినూత్నంగా విధులు నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అందరిలా కాకుండా కాస్త కొత్తగా రోడ్డుపై డ్యాన్స్‌ చేస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. మహ్మద్‌ మోసిన్‌ షేక్‌ అనే వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ట్రాఫిక్‌ పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా నృత్యం చేస్తూ ట్రాఫిక్‌ నిబంధనలను వాహనదారులకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ స్నేహపూర్వక వాతావరణాన్ని అందిస్తున్నారు. నిజానికి మధ్యప్రదేశ్‌లోని ట్రాఫిక్ పోలీస్ రంజిత్ సింగ్ ఇలాగే చేస్తుంటారు. ఆయన్ని చూసి ప్రేరణ పొంది తానూ అలా చేస్తున్నానని మొహసిన్ షేక్ చెబుతున్నారు.



Next Story