ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ళ బాలుడు లైంగిక దాడి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Nov 2019 6:34 AM GMT
ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ళ బాలుడు లైంగిక దాడి..

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రసాదం కోసం గుడికి వెళ్లి తిరిగి వస్తున్న ఒకటో తరగతి బాలికపై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పమిడిముక్కల మండలం ఐనపూరు గ్రామానికి చెందిన దూడల సాంబశివరావు కుమార్తె ప్రసాదం కోసం శివాలయంకు ప్రతి రోజు వెళ్లి వస్తుంది.

ఈ క్రమంలో గురువారం సాయంత్రం ప్రసాదానికి వెళ్ళిన పాప తిరిగి రాకపోవడంతో తండ్రి కంగారు పడుతూ బాలిక కోసం వెదకసాగాడు. సాయంత్రం 6.30 పాప ను వెతుక్కుంటూ వెళ్లేసరికి రైస్ మిల్లు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో పాప తనుశ్రీ పై అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ళ దూడల ధనుష్ ఉండగా తండ్రి సాంబశివరావు కేకలు వేసుకుంటూవేసుకుంటూ పరుగెత్తే సరికి ధనుష్ పారిపోయాడు. బాలికకు తీవ్ర

రక్త స్రావం కావడంతో క్లినిక్‌కు తీసుకువెళ్లగా డాక్టర్‌ లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించాడు. గురువారం రాత్రి పమిడిముక్కల పోలీసు స్టేషన్ లో బాధిత బాలిక తండ్రి సాంబశివరావు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శుక్రవారం ధనుష్ పై ఐపీసీ 376, పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై జీ. శ్రీనివాస్ తెలిపారు.

Next Story
Share it