ఆస్పత్రుల నుంచి కరోనా బాధితులు జంప్..ఆందోళనలో అధికారులు
By రాణి Published on 14 March 2020 6:20 AM GMTభారత్ లో రోజురోజుకూ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. కర్ణాటక యాక్షన్ ప్లాన్ లో భాగంగా..వారంరోజుల పాటు అక్కడి వ్యాపార సంస్థలు, మాల్స్, స్కూళ్లు, సినిమా థియేటర్లన్నింటినీ మూసివేయాలని ప్రకటించింది. అలాగే అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని తెలిపింది. అలాగే పెళ్లిళ్లు..ఇతరత్రా ఫంక్షన్లను కూడా వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అలాగే బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం కూడా ఉద్యోగులందరినీ ఖాళీ చేయించింది. కరోనా మహమ్మారి ముప్పు ఉండటంతో ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేసింది.
Also Read : భారత్ లో రాష్ర్టాల వారీగా కరోనా బాధితుల సంఖ్య ఇలా..
ఇప్పటికే భారత్ లో కరోనా లక్షణాలతో ఇద్దరు మృతి చెందగా..మరోవైపు కరోనా లక్షణాలతో ఉన్న 9 మంది అదృశ్యమవ్వడంపై అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంజాబ్ కు చెందిన ఏడుగురు వ్యక్తులు కరోనా లక్షణాలతో ఉండగా..వారికి ఐసోలేషన్ వార్డుల్లో వైద్యులు చికిత్స అందిస్తుండగా ఉన్నట్లుండి వారంతా ఆస్పత్రి నుంచి అదృశ్యమయ్యారు. అలాగే కేరళలో కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన అమెరికా దంపతులు కూడా ఆస్పత్రి నుంచి పరారయ్యారు. ఆ 9 మంది ఎక్కడికెళ్లారో..నిజంగానే వారికి కరోనా వైరస్ సోకి ఉంటే..వారి ద్వారా ఇంకెంతమందికి కరోనా ఎఫెక్ట్ అవుతుందోనని వైద్యులు, అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Also Read : కరోనా భయంతో ఎవరెస్టు అధిరోహణకు నో
ఇదిలా ఉండగా..చైనా తమ దేశంలో కరోనా వైరస్ సోకి వేల మంది మరణించడానికి..80 వేలకు పైగా కరోనా బాధితులయ్యేందుకు అమెరికానే ముఖ్యకారణమంటూ ఆరోపిస్తోంది. అమెరికా ఆర్మీనే ఈ వైరస్‌ను చైనాకు తీసుకొచ్చిందనే అనుమానం వ్యక్తం చేస్తూ తాజాగా చైనా అధికారులు ఆరోపణ చేశారు. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిజియన్ జాహో తన ట్విటర్ పేజీలో ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే చైనా-అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్న సమయంలో ఈ మాటల యుద్ధం మరింత ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది.
Also Read : కరోనా పుట్టిల్లు ఏది ?
అంతేకాదు ఈ వైరస్‌కు అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొవిడ్-19’ అని పేరు నిర్ణయించినప్పటికీ .అమెరికన్లు మాత్రం ‘చైనా వైరస్’గానే సంభోదిస్తున్నారు. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర ఉన్నతాధికారులు కూడా దీన్ని ‘వుహాన్ వైరస్’, ‘చైనా వైరస్’గానే అభివర్ణించడం చైనా జీర్ణించుకోలేకపోతోంది.