కరోనా భయంతో ఎవరెస్టు అధిరోహణకు నో
By రాణి Published on 14 March 2020 5:45 AM GMT
కరోనా వైరస్ భయం ఆకాశపు అంచును తాకింది.. నేపాల్ గవర్నమెంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు నో ఎంట్రీ చెప్పేసింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : కరోనా పుట్టిల్లు ఏది ?
WHO కరోనాను మహమ్మారిగా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ప్రపంచ దేశాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవటం మొదలు పెట్టాయి. కరోనా ప్రస్తుతం 134 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో ఎవరెస్టు అధిరోహణ అనుమతులను నిలిపివేస్తూ తాజాగా నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టిబెట్ నుంచి ఈ శిఖరాన్ని అధిరోహించటానికి ఉన్న మార్గాన్ని మూసి వేస్తున్నట్లు చైనా ప్రకటించింది.
Also Read : అక్కడ కిలో చికెన్ రూ.10 లకే
ఎవరెస్టుతో సహా తమ దేశంలోని అన్ని పర్వతాల అధిరోహణ అనుమతులు, పర్యాటక వీసాలనూ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులపై వచ్చే నెలలో సమీక్ష నిర్వహించి అనుమతులపై పునరాలోచిస్తామని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది. నిజానికి ఎవరెస్ట్ ఎక్కడానికి ఇదే కరెక్ట్ సీజన్. ఈ అనుమతులు తీసుకునేందుకు దాదాపు 11వేల డాలర్ల వరకూ ఖర్చు అవుతాయి. అదే సమయంలో కరోనా భయం పొంచి ఉండటంతో నో ఎంట్రీ చెప్పకతప్పలేదు. పర్వతం పైకి ఎక్కే కొలదీ శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. పైగా కరోనాకు గురయ్యామని తెలియకుండానే పర్యటనకు బయల్దేరితే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయి ప్రాణం పోయే ప్రమాదముంది.
Also Read : తెనాలి టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఎక్సైజ్ దాడులు