ఏపీలో కొత్తగా 7,948 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2020 11:31 AM GMT
ఏపీలో కొత్తగా 7,948 పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా నిత్యం 5వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 62,979 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,948 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,297కి చేరింది.

కొవిడ్‌ వల్ల గుంటూరులో పదకొండు మంది, కర్నూలులో పది మంది, విశాఖపట్నంలో తొమ్మిది మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కృష్ణలో నలుగురు, నెల్లూరులో నలుగురు, విజయనగరంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, కడపలో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున 58 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1148 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 52,622 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 56,527 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 740,

చిత్తూరులో 452,

ఈస్ట్‌ గోదావరిలో 1367,

గుంటూరులో 945,

కడపలో 650,

కృష్ణలో 293,

కర్నూలులో 1146,

నెల్లూరులో 369,

ప్రకాశంలో 335,

శ్రీకాకుంలో 392,

విశాఖపట్నంలో 282,

విజయనగరంలో 220,

పశ్చిమ గోదావరిలో 757 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story