ఓ వ్యక్తి వృద్ధురాలిని గన్‌తో కాల్చుతుంటే కాపాడాల్సింది పోయి మొబైల్‌లో చిత్రీకరణ
By సుభాష్ Published on 16 April 2020 10:21 PM IST![ఓ వ్యక్తి వృద్ధురాలిని గన్‌తో కాల్చుతుంటే కాపాడాల్సింది పోయి మొబైల్‌లో చిత్రీకరణ ఓ వ్యక్తి వృద్ధురాలిని గన్‌తో కాల్చుతుంటే కాపాడాల్సింది పోయి మొబైల్‌లో చిత్రీకరణ](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/62-Year-Old-Woman-Shot-Dead-in-UP.jpg)
మానవత్వం మంటకలిసిపోతోంది. ప్రాణాలు పోతున్న దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో బంధిస్తూ వికృతానందం పొందాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కస్‌గంజ్ ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల వృద్ధురాలిని ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీతో రెండు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. అతను విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుంటే చుట్టుపక్కల వారు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఓ వ్యక్తి తన భవనం ఎక్కి ఈ ఘటనను మొత్తం తన మొబైల్‌లో బంధించాడు. వృద్ధురాలి తలకు పాయింట్ బ్లాక్ రేజ్‌లో గన్‌పెట్టి కాల్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. మొదట ఆ వ్యక్తి కాల్పులు జరపగా, ఆమె పారిపోయేందుకు ప్రయత్నించింది. దీంతో మరోసారి కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వృద్దురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనంతరం ఫోన్‌లో తీసిన వీడియో ఆధారంగా నిందితున్ని అరెస్టు చేశారు. నిందితుడి పేరు మోను అని, అయితే వృద్ధురాలిని ఎందుకు కాల్చాడో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ ఘటన జరుగుతుంటే పట్టించుకోకుండా వీడియో తీసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.