ఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ఇచ్చారు. ఏప్రిల్‌ 5న దేశ ప్రజలంతా జాగరణ చేయాలని పిలుపునిచ్చారు. రాత్రి 9 గంటలకు దేశ ప్రజలంతా తొమ్మిది నిమిషాల పాటు జ్యోతులు వెలిగించాలన్నారు. ఇళ్లలోని విద్యుత్‌ దీపాలు బంద్‌ చేసి బాల్కానీలోకి రావాలని ప్రధాని మోదీ అన్నారు.ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు జ్యోతులు వెలగించాలని ప్రధాని మోదీ ప్రజలను పిలుపునిచ్చారు. కొవ్వొత్తి, దీపం లేదా మొబైల్‌ ఫ్లాష్‌ లైట్లు ఆన్‌ చేయాలన్నారు. కరోనా చీకట్లను తరిమేయాలని ప్రధాని మోదీ అన్నారు. ఎవరు, ఎక్కడ ఉన్నా రాత్రి తొమ్మిది గంటలకు లైట్లు ఆపేయాలన్నారు. అయితే ఈ కార్యక్రమంలో అందరూ కూడా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని ప్రధాని మోదీ కోరారు. రాబోయే 11 రోజులు అత్యంత కీలకమైనవన్నారు. 130 కోట్ల మంది ప్రజలు తమ సంకల్ప శక్తి చాటాలన్నారు. కరోనాపై యుద్ధానికి ప్రజలు బాగా సహకరిస్తున్నారని మోదీ ప్రశంసించారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటే.. కరోనాను జయించినట్లేనని, ఐక్యంగా పోరాడితే విజయం సాధిస్తామని మోదీ అన్నారు. భారతీయులంతా ఏకమై.. కరోనాను తరిమికొడతారు అని అన్నారు.అంజి గోనె

Next Story