ఏపీలో 24 గంట‌ల్లో 57 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 May 2020 6:25 AM GMT
ఏపీలో 24 గంట‌ల్లో 57 కేసులు

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 9,038 సాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా.. 57 మందికి క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2157కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 48 మంది మృతి చెందారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో 1252 మంది డిశ్చార్జి కాగా.. 857 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో అనంత‌పురంలో4, చిత్తూరులో 14, తూర్పుగోదావ‌రిలో 1, క‌డ‌ప‌లో 2, కృష్ణాలో 9, క‌ర్నూలులో 8, నెల్లూరులో 14, విశాఖ‌ప‌ట్నంలో 2, విజ‌య‌న‌గ‌రంలో 3 కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్నూలులో అత్య‌ధికంగా 599 కేసులు న‌మోదు కాగా.. గుంటూరులో 404, కృష్ణాలో 360, చిత్తూరులో 165, అనంత‌పురంలో 122, నెల్లూరులో 140 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

Untitled 3

Next Story
Share it