తెలంగాణలో నేడు కొత్తగా మరో 52 కరోనా కేసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 May 2020 4:22 PM GMTతెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 30 జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాకున్నా ఒక్క హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కేసుల విషయానికి వస్తే.. శనివారం ఒక్క రోజే మరో 52 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం 1813 కేసులు నమోదు కాగా.. 49 మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకూ 1,068 మంది డిశ్చార్జ్ కాగా, 696 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
అయితే శనివారం కరోనా నుంచి కోలుకుని 25మంది డిశ్చార్జ్ కాగా, ఒకరు మృతి చెందారు. ప్రతి రోజు నమోదువుతున్న కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 కేసులు, వలస కార్మికుల ద్వారా 19 కేసులు నమోదయ్యాయి.
కాగా, వరంగల్ రూరల్, యాదాద్రి భువగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. మిగతా జిల్లాల్లో కూడా గత 14 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.