చనిపోయిన 14 ఏళ్ల బాలిక శవాన్ని వెలికి తీసి అత్యాచార యత్నం
By సుభాష్ Published on 21 May 2020 2:18 PM GMTదేశంలో మనుషులు రోజురోజుకు పూర్తిగా దిగజారిపోతున్నారు. ఎంతంటే సమాజం తలదించుకునేలా తయారవుతున్నారు. అలాంటి ఘటనే మీకు చెప్పేది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను చూసి ప్రతి ఒక్కరు ముక్కన లేసుకుంటున్నారు. అంతేకాదు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను సమాజంలో ఉండే అర్హత లేదని, ఇలాంటి నీచులను ఏం చేసిన పాపం లేదన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే... మృతి చెందిన 14 ఏళ్ల బాలిక శవాన్ని బయటకు తీసి అత్యాచారయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి జుగుప్సాకర ఘటన అస్సాంలో వెలుగు చూసింది. దేమాజీ ఎస్పీ ధనంజయ్ గానావత్ తెలిపిన వివరాల ప్రకారం..
అస్సాంకు చెందిన 14 ఏళ్ల బాలిక మే 17వ తేదీన అనుమానస్పదంగా మరణిచింది. అదే రోజు రాత్రి ఆమె కుటుంబ సభ్యులు గ్రామానికి సమీపంలో ఉన్న సైమన్ నదీ తీరంలో ఖననం చేశారు. ఇక అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోటు అంటే... మే 18వ తేదీన అకాన్ సైకియా (51) అనే వ్యక్తి బాలికను ఖననం చేసిన ప్రదేశానికి వెళ్లి శవాన్ని బయటకు తీసి అత్యాచారయత్నానికి ప్రయత్నిస్తుండగా, అటుగా వెళ్తున్న ఓ జాలరి గమనించాడు. ఆ వ్యక్తి చేస్తున్న పనిని చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అకాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
అంతేకాదు సదరు ఇలాంటి ఘటనకు పాల్పడటం చూసిన పోలీసులే ఆశ్చర్యపోయారు. కాగా, బాలిక శవాన్ని పరీక్షించేందుకు ఆమె కుటుంబ సభ్యుల అనుమతి కోరారు. వారి అనుమతిలో బాలిక శవాన్ని పోస్టుమార్టంకు ఆస్పత్రికి తరలించారు. రిపోర్టు రావాల్సి ఉందని ఎస్పీ ధనంజయ్ తెలిపారు. అకాన్‌పై ఫోక్సో చట్టంతోపాటు ఐపీసీ 306,377 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిందితుడిపై గతంలోనూ కేసులు
కాగా, కేసులో నిందితుడిగా ఉన్న అకాన్ సైకియాపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు అకాన్‌కు ఇప్పటికే రెండు సార్లు పెళ్లిళ్లు కూడా అయ్యాయట. 2018లో మొదటి భార్య గృహహింస కింద కేసు పెట్టడంతో దేమాజీ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే కరోనా వైరస్ కారణంగా జైలు ఖైదీలకు కరోనా సోకే అవకాశం ఉండటంతో కరోనా తగ్గే వరకూ పలువురు ఖైదీలకు పెరోల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మార్చి నెలాఖరులో అకాన్‌కు పెరోల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.
ఇక బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి దారుణానికి పాల్పడటం సంచలనంగా మారింది. అకాన్ మానసిక పరిస్థితి గురించి వైద్యులు పరీక్షించారు. అకాన్ మహిళల పట్ల సైకోగా వ్యవహరించాడని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. కాగా, అకాన్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్య చేసుకుందని పలువురు గ్రామస్తులు ఆరోపించారంటూ ఎస్పీ ధనంజయ్ పేర్కొన్నారు.