బ్రేకింగ్: భారత్‌లో నాలుగో కరోనా మరణం
By సుభాష్ Published on 19 March 2020 11:57 AM GMTకరోనా బారిన పడ్డ మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 70 ఏళ్ల వృద్ధుడు చనిపోవడంతో దేశంలో మరణాల సంఖ్యా నాలుగుకు చేరింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక భారత్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది.. తాజాగా గురువారం పంజాబ్‌లో మరో వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దీంతో కరోనా మరణాలు నాలుగుకు చేరాయి. కాగా, ఇప్పటి వరకు భారత్‌లో 184 మందికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనాపై తాగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 8వేలకుపైగా మృతి చెందగా, దాదాపు 2 లక్షలకు పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇటలీ నుంచి జర్మనీ మీదుగా భారత్‌కు వచ్చిన 72 ఏళ్ల వృద్ధుడు పంజాబ్‌లో మృతి చెందాడు. తీవ్రమైన ఛాతి నొప్పి కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్‌లో తొలి కరోనా మరణం కర్ణాటక కాగా, గుల్బార్గాకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు మక్కా నుంచి తిరిగి వచ్చాక కరోనా బారిన పడి మృతి చెందాడు. ఇక రెండో కరోనా మరణం ఢిల్లీకి చెందిన ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆ తర్వాత మహారాష్ట్రలో 68 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి మృతి చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లే కావడం గమనార్హం.