ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా.. ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తుంది. రోజురోజుకూ విజృంబిస్తూ.. సామాన్యుడి కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. ఇక మ‌న భార‌త్‌లో కూడా ఈ వైర‌స్ త‌న స‌త్తా చూపిస్తుండ‌గా.. తాజాగా ఓ వ్య‌క్తి కరోనా సోకిందన్న అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివ‌రాళ్లోకెళితే.. ఢిల్లీ ఇందిరా గాంధీ ఏయిర్‌పోర్టులో ఓ 35ఏళ్ల వ్యక్తిని కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో అధికారులు అక్కడి నుంచి తరలించారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సఫ్‌దార్‌జంగ్‌ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. రక్తపు నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు.

అయితే రిపోర్టు రాకముందే అతడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డు 7వ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్‌కు చెందిన అతడు గత సంవత్సరకాలంగా సిడ్నీలో ఉంటున్నాడని, ఎయిర్‌ ఇండియా విమానంలో ఢిల్లీ చేరుకున్నాడని తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.