ఒక్క‌రోజే 40 పాజిటివ్ కేసులు.. 400 దాటిన కౌంట్‌

By అంజి  Published on  7 April 2020 4:27 PM GMT
ఒక్క‌రోజే 40 పాజిటివ్ కేసులు.. 400 దాటిన కౌంట్‌

ప్ర‌పంచానికి కునుకు లేకుండా చేస్తున్న క‌రోనా.. తెలంగాణలో కూడా రోజురోజుకు మరింత పెరుగుతుంది. తాజాగా.. ఈ రోజు మ‌రో 40 కొత్త కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు 404 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయిన‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి.

Also Read: పాలు తాగాడని కొడుకుని చంపి తండ్రి ఆత్మహత్య..

ఇదిలావుంటే.. తెలంగాణ‌లో ప్రస్తుతం కరోనా నుంచి 45 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. మ‌రో 348 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. ఇక‌ ఇప్పటివరకు రాష్ట్రంలో 11 మంది కరోనా సోకి చనిపోయారు. రాష్ట్ర‌వ్యాప్తంగా రాజ‌దాని హైదరాబాద్ న‌గ‌రంలో అత్యధికంగా 150 కేసులు నమోదు కాగా.. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో 36, వరంగల్‌ అర్బన్‌లో 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, లాక్‌డౌన్ గ‌డువు ద‌గ్గ‌రికొస్తున్న నేఫ‌థ్యంలో క‌రోనా వ్యాప్తి విస్తృతమ‌వుతుండ‌టంతో.. మ‌రోమారు లాక్‌డౌన్ పొడిగించే యోచ‌న‌లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలున్న‌ట్లు తెలుస్తుంది.

Also Read:లాక్‌డౌన్‌లో మ‌తిపోగొట్టేసిందిగా..!

Next Story
Share it