పాలు తాగాడని కొడుకుని చంపి తండ్రి ఆత్మహత్య..
By రాణి Published on 7 April 2020 3:12 PM GMT
ఎక్కడైనా ఆస్తి కోసమో, డబ్బు కోసమో హత్యలు చేసిన వార్తలు వింటుంటాం. కానీ పాల కోసం కొడుకును హత్య చేసిన ఘటన ఎక్కడైనా చూశారా ? ఇలాంటి వింత ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పురానాపూర్ ఘంగ్ ఛాయ్ లో వెలుగుచూసింది. గుర్ముఖ్ అనే వ్యక్తి సోదరుడు అవతార్ సింగ్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్ముఖ్ తన కోసం దాచుకున్న పాలను 16 ఏళ్ల కొడుకు జస్కరన్ తాగాడన్న కోపంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. గొడవ పెద్దది కావడంతో గుర్ముఖ్ తనవద్దనున్న తుపాకీతో కొడుకుని కాల్చి చంపాడు. మధ్యలో అడ్డమొచ్చిన అవతార్ పై కూడా కాల్పులు జరపడంతో అతను గాయపడ్డాడు. అనంతరం గుర్ముఖ్ కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గాయపడిన అవతార్ ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించాడు. అవతార్ చెప్పిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది.
Also Read :కరోనా పై పోరుకు డీమార్ట్ భారీ విరాళం