వెంటాడుతున్న కరోనా: 3 లక్షలకు కరోనా మృతులు
By సుభాష్ Published on 14 May 2020 10:02 AM ISTకరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటికీ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారు 44 లక్షలు దాటింది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకూ 44,25,700 కరోనా కేసులు మోదైనట్లు తెలుస్తోంది. అలాగే 2,97,780 మంది మృతి చెందారు. ఆస్పత్రుల్లో కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు 16,57,200 మంది ఉన్నారు.ఇక 24,70,815 కేసులు యాక్టివ్‌గా ఉండగా, అందులో 45వేల 921 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బుధవారం ఒక్క రోజే కొత్తగా 21,712 కేసులు నమోదు కాగా, 1772 మంది మృతి చెందారు. ఇక అమెరికాలో 85,198 మంది మృతి చెందినట్లు లెక్కలు చెబుతున్నాయి.
చైనాకు చేరువలో భారత్
కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక భారత్‌లో కూడా తీవ్రస్థాయిలో విజృంభిస్తోందని, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కాగా, కరోనా కేసుల్లో భారత్ చైనాకు దగ్గరకు చేరింది. ఈ వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో చైనా 11వ స్థానంలో ఉండగా, భారత్ 12వ స్థానంలో ఉంది. చైనాలో కేసుల సంఖ్య 82,900 దాటిపోగా, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. మంగళవారం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖఖ్య 70,756కు చేరింది. ముందు రోజుతో పోలిస్తే 3,604 కొత్తగా నమోదయ్యాయి. ఇక 1538 మంది కోలుకున్నారు. 87 మంది వరకూ మృతి చెందారు. ఇక నెల రోజుల క్రితం మరణాల రేటు చూసుకుంటే ఒకేలా ఉంది. రికవరీ రేటు మాత్రం నెల రోజుల్లో 9.05శాతం నుంచి 31.73కి చేరింది