హైదరాబాద్‌: ప్రత్యేక రైళ్లకు వెయిటింగ్‌ లిస్ట్‌.. ఎప్పటి నుంచి అంటే..

By సుభాష్  Published on  14 May 2020 4:09 AM GMT
హైదరాబాద్‌: ప్రత్యేక రైళ్లకు వెయిటింగ్‌ లిస్ట్‌.. ఎప్పటి నుంచి అంటే..

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైళ్లన్ని నిలిచిపోయాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి కొన్ని సడలింపులలో భాగంగా రైళ్లన్ని మళ్లీ పట్టాలెక్కాయి. ఇక ప్రత్యేక రైళ్లకు ఈనెల 22వ తేదీ నుంచి వెయిటింగ్‌ లిస్టును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఏసీ -3 టైర్‌కు 100, 2టైర్‌కు 50, స్లీపరర్‌కు 200, కార్ చైర్‌కు 100, ఫస్ట్‌ ఏసీకి 20ల చొప్పున వెయిటింగ్‌ లిస్టును సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు రైళ్ల సంఖ్యను కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లలో రైళ్లలో సెల్ఫీలు దిగవద్దని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

ప్రత్యేక రైళ్లు, శ్రామిక్‌ రైళ్లు, పార్సిల్‌ రైళ్లను నడుస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా దక్షిణ మధ్య రైల్వే జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాదు రైల్వే ట్రాక్‌పై ఎవ్వరు కూడా నడవకూడదని స్పష్టం చేసింది.

Next Story