హైదరాబాద్‌: త్వరలో పరుగులు పెట్టనున్న మెట్రో.. ఆ కార్డు ఉంటేనే అనుమతి.!

By సుభాష్  Published on  14 May 2020 3:39 AM GMT
హైదరాబాద్‌: త్వరలో పరుగులు పెట్టనున్న మెట్రో.. ఆ కార్డు ఉంటేనే అనుమతి.!

కరోనా వైరస్‌ ప్రభావం అంతాఇంతా కాదు. దేశంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో ప్రజలెవ్వరూ బయటకు రాకపోవడమే కాదు.. వివిధ రంగాలకు చెందిన సంస్థలు మూతపడ్డాయి. రవాణా సర్వీసులు, రైళ్లు, అలాగే మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లాక్‌డౌన్‌ నుంచి కొన్ని కొన్ని సడలింపులు ఇస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులను నడిపేందుకు సిద్ధమవుతోంది. ఒక వేళ మెట్రో రైలును నడిపితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులు చర్చలు కొనసాగుతున్నారు.

త్వరలో మెట్రో రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఒక వేళ మెట్రోను నడిపితే అందరికి ప్రయాణికులకు అనుమతి ఉండదు. కేవలం మెట్రో కార్డు ఉన్నవారికి మాత్రమేనని సమాచారం. టోకెన్‌ తీసుకోవడం అనేది ఉండదు. టికెట్‌ కౌంటర్లు మూసే ఉంటాయని తెలుస్తోంది. అలాగే మెట్రోలో ఒక్కో సీటు మధ్య గ్యాప్‌ ఇస్తూ భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడుతున్నారట మెట్రో అధికారులు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొదట్లో కరోనా వైరస్‌ నెమ్మది ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో రాష్ట్రంతో పాటు దేశంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై అన్ని చర్యలు చేపట్టింది.

Hyd1

అయితే తెలుగు రాష్ట్రాలలో ఏపీలో మాత్రం రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నా.. తెలంగాణలో వారం రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది. కానీ రెండు, మూడు రోజుల నుంచి హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు కొంత వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్‌ మెట్రోను నడిపే ఆలోచనలో ఉంది. మెట్రో ఎక్కే ప్రయాణికులు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం తప్పని సరి చేయనున్నారు. ఒక వేళ నిబంధనలు ఉల్లంగించినట్లయితే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

సామాజిక దూరంలో భాగంగా మెట్రోలో సీట్లలో ఒక సీటు ఖాలీగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు మెట్రో సీట్లకు స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఈ స్టిక్కర్లు ఉన్న సీటులోనే ప్రయాణికులు కూర్చునేలా చర్యలు చేపడుతున్నట్లు ఈ వీడియో చూస్తుంటే అర్థమైపోతోంది.

[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-14-at-7.49.16-AM.mp4"][/video]

Next Story