భారత్‌లో 24గంటల్లో 24,850 కేసులు.. 613 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2020 10:40 AM IST
భారత్‌లో 24గంటల్లో 24,850 కేసులు.. 613 మంది మృతి

భారత్‌లో నిత్యం రికార్డు సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతన్నాయి. దేశంలో లాక్‌డౌన్‌ సడలింపులు అనంతరం కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. నిత్యం 18వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 24,850 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 613 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ లో వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 6,73,165 పాటిజివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి భారిన పడి 19,268 మంది మరణించారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 4,09,083 కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,48,934 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 97,89,066 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,48,934 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. ప్రపంచలోనే అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా 28లక్షల కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. 15లక్షల కేసులతో బ్రెజిల్‌, 6.7లక్షల కేసులతో రష్యా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

Next Story