పోలీసులే షాకయ్యారు.. 2179 కిలోల డ్రగ్స్ పట్టివేత
By సుభాష్ Published on 1 Jun 2020 10:49 AM ISTఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంటే మరో వైపు డ్రగ్ మాఫియా ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. యధేచ్చగా డగ్స్ సరఫరా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక హర్యానా రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్ పట్టిబడింది. ఇక కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. గడిచిన రెండు నెలలుగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా, పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకూ హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,179 కిలోల నార్కోటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని చెబుతున్నారు. గడిచిన రెండు నెలల్లో 326 కేసులు డ్రగ్స్‌కు సంబంధించినవే ఉన్నాయని, 506 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ కేసులన్నీ కూడా మార్చి 23 నుంచి మే 23 మధ్యలో నమోదైనట్లు చెప్పారు. అయితే లాక్‌డౌన్ సమయంలో కూడా డ్రగ్ మాఫియా దందాలను కొనసాగించడం పోలీసులే షాకవుతున్నారు.
గడిచిన రెండు నెలల్లో ఏమేమి పట్టబడ్డాయి:
► గంజాయి - 288 కిలోలు
► పప్సీ హస్క్ - 1341 కిలోలు
► హెరాయిన్ - 14 కిలోలు
► ఓపియం - 11 కిలోలు
► గంజాయి పట్టీ - 331 కిలోలు
► చరస్ - 56 కిలోలు
► స్కాక్ - 844 కిలోలు
► దోడా పోస్ట్ - 23 కిలోలు
► ఓపియ్ ప్లాంట్స్ 115
అంతేకాకుండా దాదాపు 92 వేల వరకూ ఫార్మా ట్యాబ్లెట్స్, 1500లకుపైగా సిరప్‌లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.