Fact Check : 200 రూపాయల నోటు మీద శివాజీ మహారాజ్ ఫోటోను ముద్రించారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2020 8:23 AM GMT
Fact Check : 200 రూపాయల నోటు మీద శివాజీ మహారాజ్ ఫోటోను ముద్రించారా..?

200 రూపాయల నోటుపై ఇక ఛత్రపతి శివాజీ బొమ్మ ఉండబోతోందనే పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇకపై 200 రూపాయల నోటు మీద ఛత్రపతి శివాజీ బొమ్మను ముద్రిస్తోందని చెబుతూ ఉన్నారు. చాలా మందికి వాట్సప్ లో ఈ మెసేజీ వస్తోంది.

S1

“Soon to be released new 200 notes will first time have face of Chhatrapati Shivaji Maharaj. 🚩🚩By next year, faces of many such great Hindu leaders will be printed on currency notes by the RBI. 🚩🚩”.అంటూ మెసేజీ అందుకుంటూ ఉన్నారు. అతి త్వరలోనే 200 రూపాయల నోటు మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ ను చూడబోతున్నాం.. రాబోయే సంవత్సరంలో ఎంతో మంది హిందూ నేతలకు సంబంధించిన ముఖాలను 200 రూపాయల నోటు మీద చూస్తాము అన్నది ఆ మెసేజీ సారాంశం.

S2

న్యూస్ మీటర్ కు ఈ వైరల్ పోస్టు వెనుక ఉన్న నిజానిజాలేమిటో తెలియజేయాలని రిక్వెస్ట్ అందింది.

ట్విట్టర్ లో కూడా ఈ ఫోటోలను చాలా మంది పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

న్యూస్ మీటర్ ఈ వైరల్ అవుతున్న పోస్టులు ఉన్న ట్విట్టర్ ఖాతాలను పరిశీలించగా.. అందులో ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు పలు నోట్ల మీద ఉన్నట్లుగా ఫోటోలను గమనించవచ్చు. దేశానికి ఎంతో ఘానా కీర్తిని తీసుకుని వచ్చిన ఛత్రపతి శివాజీ మహారాజ్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వారి చిత్రాలు పలు నోట్లపై ఉండాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేలా అందుకు సంబంధించి ఎడిట్ చేసి ఫోటోలను అప్లోడ్ చేశారు.





ఆర్.బి.ఐ. అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించగా 2016 నుండి కొత్త నోట్లను వాడుకలోకి తీసుకుని వచ్చారు. 500, 200, 100, 50, 20, 10 రూపాయలకు సంబంధించిన కొత్త నోట్లను తీసుకుని వచ్చారు. Economic Times లో కూడా భారత కరెన్సీలో వచ్చిన మార్పుల గురించి వెల్లడించారు. మాహాత్మా గాంధీ సిరీస్ గురించి స్పష్టంగా చెప్పుకొచ్చారు కానీ.. కొత్తగా ఎవరైనా స్వాతంత్య్ర సమరయోధుల చిత్రం ఉండేలా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సరికొత్త మార్పులు తీసుకుని వచ్చిందని చెప్పలేదు. ఈ వైరల్ అవుతున్న పోస్టు నిజమయ్యేలా ఎక్కడ కూడా వార్తాకథనాలు ప్రసారం అవ్వలేదు.

2016లో నోట్ల రద్దు జరిగిన తర్వాత వచ్చిన మార్పులు మినహా ఎక్కడ కూడా నోట్లలో గాంధీ కాకుండా ఇతర స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను ఉంచినట్లుగా కథనాలు రాలేదు. వాటిలో ఎటువంటి నిజం కూడా లేదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Claim Review:Fact Check : 200 రూపాయల నోటు మీద శివాజీ మహారాజ్ ఫోటోను ముద్రించారా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story