ఈ ఏడాది 200 మంది ఉగ్రవాదులు హతం
By సుభాష్ Published on 3 Nov 2020 2:44 AM GMTజమ్మూకశ్మీర్: ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పినా ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడుతుండగా, అందుకు భారత బలగాలు తిప్పికొట్టి వారిని అంతమొందిస్తున్నారు. ఇక ఈ ఏడాది అక్టోబర్ వరకు జమ్మూలో 200 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా బలగాలు తెలిపాయి. వీరిలో ఎక్కువగా హిజ్జుల్ ముజాహిద్దీన్‌కు చెందిన వారేనని తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే 12 నె ల్లో 157 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెప్పారు. జూన్ నెలలో గరిష్ఠంగా 49 మంది హతం కాగా, ఈ ఏడాదితో పోల్చుకుంటే ఇది రెట్టింపేనని అధికారులు వెల్లడించారు.
ఏప్రిల్‌లో 28 మంది, జూలై, అక్టోబర్ నెలల్లో 28 మంది చొప్పున ఉగ్రవాదులను హతం అయినట్లు త ఎలిపారు. దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా ఎన్‌కౌంటర్లు జరిగాయని, ఈ ప్రాంతాలలో అక్టోబర్ వరకు 138 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు పేర్కొన్నారు.
పుల్వామా, షోపిన్ ప్రాంతాల్లో 98 మంది ఎన్‌కౌంటర్లలో మృతి
కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ఆకట్టుకుంటున్న పుల్వామా, షోపిన్ ప్రాంతాల్లో 98 ఎన్‌కౌంటర్లు జరిగగా, 98 మంది మృతి చెందినట్లు భద్రత అధికారులు వెల్లడించారు. పాక్ ఆర్మీ మద్దతిస్తున్న హిజ్జుల్ ముజాహీద్దీన్‌కు చెందిన 72 మంది లష్కరే తోయిబాకు చెందిన 59 మంది, జైషే ఏ మహ్మద్‌కు చెందిన 37 మంది, ఇస్లామిక్ స్టేట్‌తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన 32 మంది భద్రత బలగాల ఎన్‌కౌంటర్లలో హతయమైనట్లు వివరించారు.